🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧వ శ్లోకం
కారణపరచిద్రూపా కాఞ్చీపురసీమ్ని కామపీఠగతా ।
కాచన విహరతి కరుణాకాశ్మీరస్తబకకోమలాఙ్గలతా ॥౧.౧॥
🌷పదవిభాగం
కారణ-పర-చిత్-రూపా కాఞ్చీ-పుర-సీమ్ని కామ-పీఠ-గతా । కాచన విహరతి కరుణా-కాశ్మీర-స్తబక-కోమల-అఙ్గలతా ॥౧.౧॥
🌷అన్వయం
కాఞ్చీపురసీమ్ని కామపీఠగతా కారణపరచిద్రూపా కాశ్మీరస్తబక-కోమలాఙ్గలతా కాచన కరుణా విహరతి ॥౧.౧॥
🌷ప్రతిపదార్థం
కాఞ్చీపుర-సీమ్ని = కాంచీపుర ప్రదేశమున
కామపీఠ-గతా = కామపీఠమును పొందిన
కారణ-పర-చిద్రూపా = కారణపర చైతన్యమే స్వరూపముగా గల
కాశ్మీరస్తబకకోమలాఙ్గలతా >
కాశ్మీర-స్తబక- = కుంకుమ పూగుత్తుల వలె
కోమలాఙ్గ-లతా = కోమలమయిన తీగ వంటి దేహముగల
కాచన = ఒకానొక
కరుణా = దయ
విహరతి = విహరించుచున్నది
🌷తాత్పర్యం
జగదాధారమయిన పరతత్వము కుంకుమ పూగుత్తి వలె యెర్రనయి మృదువయిన లత వంటి శరీరము గలిగిన ఒకానొక కృప కాంచీపుర సీమ యందు విహరించుచున్నది.

No comments:
Post a Comment