🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౫వ శ్లోకం
అఙ్కితశఙ్కరదేహామఙ్కురితోరోజకఙ్కణాశ్లేషైః ।
అధికాఞ్చి నిత్యతరుణీమద్రాక్షం కాఞ్చిదధ్బుతాం బాలామ్ ॥౧.౧౫॥
🌷౧.౧౫వ శ్లోకం
అఙ్కితశఙ్కరదేహామఙ్కురితోరోజకఙ్కణాశ్లేషైః ।
అధికాఞ్చి నిత్యతరుణీమద్రాక్షం కాఞ్చిదధ్బుతాం బాలామ్ ॥౧.౧౫॥
🌷పదవిభాగం
అఙ్కిత-శఙ్కర-దేహామ్ అఙ్కురిత-ఉరోజ-కఙ్కణ-ఆశ్లేషైః । అధికాఞ్చి నిత్య-తరుణీమ్ అద్రాక్షం కాఞ్చిద్ అధ్బుతాం బాలామ్ ॥౧.౧౫॥
🌷అన్వయం
అధికాఞ్చి అఙ్కురిత-ఉరోజ-కఙ్కణాశ్లేషైః అఙ్కితశఙ్కరదేహాం నిత్యతరుణీమ్ కాఞ్చిత్ బాలామ్ అద్రాక్షమ్ ॥౧.౧౫॥
🌷ప్రతిపదార్థం
అధికాఞ్చి = కాంచీనగరి యందు
అఙ్కురిత-ఉరోజ-కఙ్కణ-ఆశ్లేషైః = అంకురించిన స్తన కంకణాలింగనముల చేత
అఙ్కిత-శఙ్కర-దేహాం = చిహ్నితమయిన శంకర దేహము గల
నిత్య-తరుణీమ్ = నిత్యయౌవనయగు
కాఞ్చిత్ = ఒకానొక
బాలామ్ = బాలను
అద్రాక్షమ్ = చూచితిని
🌷తాత్పర్యం
బిగికౌగిలిలో చనుల యొక్కయు కంకణముల యొక్కయు గుర్తులను శంకరుని మేనిపై ముద్ర వేయుదానిని యెల్లప్పుడు నిత్యయవ్వవముతో అలరు ఒక విన్తగొలుపు ముద్దరాలిని కాంచిలో కనుగొంటిని.
No comments:
Post a Comment