Friday, July 27, 2018

ఆర్యా 1.65

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬౫వ శ్లోకం
కుసుమశరగర్వసమ్పత్కోశగృహం భాతి కాఞ్చిదేశగతమ్ ।
స్థాపితమస్మిన్ కథమపి గోపితమన్తర్మయా మనోరత్నమ్ ॥౧.౬౫॥

🌷పదవిభాగం
కుసుమ-శర-గర్వ-సమ్పత్-కోశ-గృహం భాతి కాఞ్చి-దేశగతమ్ । స్థాపితమ్ అస్మిన్ కథమ్ అపి గోపితమ్ అన్తః మయా మనోరత్నమ్ ॥౧.౬౫॥

🌷అన్వయం
కుసుమశరగర్వ-సమ్పత్కోశగృహం కాఞ్చిదేశగతమ్ అస్మిన్ అన్తః కథమ్ అపి మయా మనోరత్నమ్ స్థాపితమ్ గోపితమ్ ॥౧.౬౫॥

🌷ప్రతిపదార్థం
కుసుమ-శర-గర్వ-సమ్పత్-కోశ-గృహం = మన్మథుని గర్వ సంపద యొక్క భాండాగారము
కాఞ్చి-దేశ-గతమ్ = కాంచి దేశ గతమై ఉన్నది
అస్మిన్ = దీనియందు
అన్తః = లోపల
కథమ్ అపి = ఎట్లో
మయా = నా చేత
మనో-రత్నమ్ = మనస్సనెడి రత్నము
స్థాపితమ్ = ఉంచబడిననది
గోపితమ్ = దాచబడినది

🌷తాత్పర్యం
అమ్మవారు మన్మథుని సంపద్గర్వమునకు భాండాగారము. అది కాంచీదేశమునందు ఉన్నది. దానియందు లోపల మనోరత్నమునెట్లో దాచి యుంచ గలిగితిని.

No comments:

Post a Comment