🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩౮వ శ్లోకం
లోలహృదయోఽస్మి శమ్భోర్లోచనయుగలేన లేహ్యమానాయామ్ ।
లాలితపరమశివాయాం లావణ్యామృతతరఙ్గమాలాయామ్ ॥౧.౩౮॥
🌷౧.౩౮వ శ్లోకం
లోలహృదయోఽస్మి శమ్భోర్లోచనయుగలేన లేహ్యమానాయామ్ ।
లాలితపరమశివాయాం లావణ్యామృతతరఙ్గమాలాయామ్ ॥౧.౩౮॥
🌷పదవిభాగం
లోల-హృదయః అస్మి శమ్భోః లోచన-యుగలేన లేహ్యమానాయామ్ । లాలిత-పరమ-శివాయాం లావణ్య-అమృత-తరఙ్గ-మాలాయామ్ ॥౧.౩౮॥
🌷అన్వయం
లాలితపరమశివాయాం శమ్భోః లోచనయుగలేన లేహ్యమానాయాం లావణ్యామృత-తరఙ్గమాలాయామ్ లోలహృదయః అస్మి ॥౧.౩౮॥
🌷ప్రతిపదార్థం
లాలితపరమశివాయాం >
లాలిత- = లాలింపబడిన
పరమ-శివాయాం = పరమశివుడు గల
శమ్భోః = శివుని యొక్క
లోచన-యుగలేన = రెండు కన్నులతో
లేహ్యమానాయాం = నాకబడుచున్న
లావణ్య-అమృత-తరఙ్గ-మాలాయామ్ >
లావణ్యామృత- = లావణ్యమను అమృతము యొక్క
తరఙ్గమాలాయాం = తరంగముల మాల యందు
లోల-హృదయః = ఆసక్తి గల హృదయము గల వాడనై
అస్తి = ఉన్నాను
🌷తాత్పర్యం
శంభుని చూపులచే లేహ్యమానయు పరమశివుని లాలించునదియునగు ఒక లావణ్యామృత తరంగ పంక్తి నోలలాడ వలనని కుతూహలపడు హృదయము కలవాడనై యున్నాను.
No comments:
Post a Comment