Thursday, July 26, 2018

ఆర్యా 1.25

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨౫వ శ్లోకం
సంశ్రితకాఞ్చీదేశే సరసిజదౌర్భాగ్యజాగ్రదుత్తంసే ।
సంవిన్మయే విలీయే సారస్వతపురుషకారసామ్రాజ్యే ॥౧.౨౫॥


🌷పదవిభాగం
సంశ్రిత-కాఞ్చీ-దేశే సరసిజ-దౌర్భాగ్య-జాగ్రద్-ఉత్తంసే । సంవిన్మయే విలీయే సారస్వత-పురుషకార-సామ్రాజ్యే ॥౧.౨౫॥


🌷అన్వయం
సంశ్రితకాఞ్చీదేశే సరసిజదౌర్భాగ్యజాగ్రదుత్తంసే సంవిన్మయే సారస్వతపురుషకారసామ్రాజ్యే విలీయే ॥౧.౨౫॥


🌷ప్రతిపదార్థం
సంశ్రిత-కాఞ్చీ-దేశే = కాంచీదేశమును ఆశ్రయించిన
సరసిజ-దౌర్భాగ్య-జాగ్రద్-ఉత్తంసే = కమలముల దౌర్భాగ్యమున మేల్కొనువాడు శిరోభూషణమైన
సంవిన్మయే = జ్ఞాన స్వరూపమైన
సారస్వత-పురుషకార-సామ్రాజ్యే = సరస్వతికి సంబంధించిన ప్రయత్నము యొక్క సంపూర్ణత యందు
విలీయే = లీనమగుచున్నాను


🌷తాత్పర్యం
తామరపూల దురదృష్ట రేఖచే అనగా చంద్రరేఖ చేత అలంకరించబడిన కిరీటము గలది. జ్ఞానమయమయినది, కాంచీ దేశమందు నెలకొన్నదియు నగు సర్వవిద్యా పాండిత్యము నిండు పురుషకార సామ్రాజ్యము నందు లీనుడనయ్యెదను.
    [తామరపూల దురదృష్ట రేఖ యనుటచే షట్చక్రములకు ముకుళీభావము సమకూర్చెడి చిచ్చంద్ర మండలము పరదేవత పరమార్థ స్వరూపమని సూచించబడినది.]

No comments:

Post a Comment