Thursday, July 26, 2018

ఆర్యా 1.26

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨౬వ శ్లోకం
మోదితమధుకరవిశిఖం స్వాదిమసముదాయసారకోదణ్డం ।
అద్భుతకాఞ్చీఖేలనమాదిమమారుణ్యభేదమాకలయే ॥౧.౨౬॥


🌷పదవిభాగం
మోదిత-మధుకర-విశిఖం స్వాదిమ-సముదాయ-సార-కోదణ్డం । అద్భుత-కాఞ్చీ-ఖేలనమ్ ఆదిమమ్ ఆరుణ్య-భేదమ్ ఆకలయే ॥౧.౨౬॥


🌷అన్వయం
మోదితమధుకరవిశిఖం స్వాదిమసముదాయసారకోదణ్డం అద్భుతకాఞ్చీఖేలనమ్ ఆదిమమ్ ఆరుణ్యభేదమ్ ఆకలయే ॥౧.౨౬॥


🌷ప్రతిపదార్థం
మోదిత-మధుకర-విశిఖమ్ = పూవులు బాణములుగా గల
స్వాదిమ-సముదాయ-సార-కోదణ్డమ్ = చెఱకువిల్లు గల
అదృత-కాఞ్చీ-ఖేలనమ్ = కాంచీ నగర ప్రదేశమున ఆడుటయందు ఆదరము గల
ఆదిమమ్ = మొదటి
ఆరుణ్య-భేదమ్ = ఒకవిధమయిన ఎరుపును
ఆకలయే = ధ్యానించెదను


🌷తాత్పర్యం
పూలు బాణములుగాగల చెరకు విల్లుగాగల కాంచీపురములో ఆడుకొనుట యందు ఇష్టము గల ఒక అరుణిమ విశేషమును ధ్యానించెదను.

No comments:

Post a Comment