Thursday, July 26, 2018

ఆర్యా 1.16

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౬వ శ్లోకం
మధురధనుషా మహీధరజనుషా నన్దామి సురభిబాణజుషా ।
చిద్వపుషా కాఞ్చిపురే కేలిజుషా బన్ధుజీవకాన్తిముషా ॥౧.౧౬॥

🌷పదవిభాగం
మధుర-ధనుషా మహీధర-జనుషా నన్దామి సురభి-బాణ-జుషా । చిద్-వపుషా కాఞ్చి-పురే కేలి-జుషా బన్ధు-జీవ-కాన్తిముషా ॥౧.౧౬॥

🌷అన్వయం
మధురధనుషా సురభిబాణజుషా బన్ధుజీవ-కాన్తిముషా కాఞ్చిపురే కేలిజుషా చిద్వపుషా మహీధర-జనుషా నన్దామి ॥౧.౧౬॥

🌷ప్రతిపదార్థం
మధుర-ధనుషా = తీయని విల్లుగల
సురభి-బాణ-జుషా = సుగంధిలమయిన అమ్ము గల
బన్ధు-జీవ-కాన్తి-ముషా = బంధుజీవ పుష్పము యొక్క కాంతిని దొంగలించు
కాఞ్చి-పురే = కాంచీ నగరియందు
కేలి-జుషా = ఆట కలిసిన
చిద్వపుషా = చైతన్యమే శరీరముగాగల
మహీధర-జనుషా = కొండయందు జన్మగల దాని చేత
నన్దామి = ఆనందించుచున్నాను

🌷తాత్పర్యం
తియ్యని విల్లును, సువాసనల నించు బాణములు దాలిచి, మంకెన పువ్వు రంగును మించు శరీర వర్ణము కలిగి, కాంచీపురమందు ఆడుకొనుచుండెడి కొండరాచూలియైన ఒక చిద్రూపముతో మురియుచున్నాను.

No comments:

Post a Comment