Friday, July 27, 2018

ఆర్యా 1.58

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫౮వ శ్లోకం
పఞ్చదశవర్ణరూపం కఞ్చన కాఞ్చీవిహారధౌరేయమ్ ।
పఞ్చశరీయం శమ్భోర్వఞ్చనవైదగ్ధ్యమూలమవలమ్బే ॥౧.౫౮॥

🌷పదవిభాగం
పఞ్చదశ-వర్ణరూపం కఞ్చన కాఞ్చీ-విహార-ధౌరేయమ్ పఞ్చ-శరీయం శమ్భోః వఞ్చన-వైదగ్ధ్య-మూలమ్ అవలమ్బే ॥౧.౫౮॥

🌷అన్వయం
పఞ్చదశవర్ణరూపం కాఞ్చీవిహారధౌరేయం పఞ్చశరీయమ్ కఞ్చన శమ్భోః వఞ్చనవైదగ్ధ్యమూలమ్ అవలమ్బే ॥౧.౫౮॥

🌷ప్రతిపదార్థం
పఞ్చదశ-వర్ణ-రూపం = పదిహేను వర్ణముల మంత్రమే రూపముగా గల
కాఞ్చీ-విహార-ధౌరేయం = కాంచీ నగరమున విహరించుటకు ముందుండు
పఞ్చ-శరీయమ్ = మన్మథునకు సంబంధించిన
కఞ్చన = ఒకానొక
శమ్భోః = శివుని యొక్క
వఞ్చన-వైదగ్ధ్య-మూలమ్ = మోసము చేయు నేర్పరితనమునకు మూలమును, అమ్మవారిని
అవలమ్బే = ఆశ్రయించెదను

🌷తాత్పర్యం
కాంచీపురవిహారమందు ఆసక్తి చూపే, శివుని వంచింప వలెనను మన్మథుని నైపుణ్యమునకు మూలమయిన పంచదశీ మంత్రరూపిణి యగు అమ్మవారిని ఆశ్రయించెదను.

No comments:

Post a Comment