🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩వ శ్లోకం
చిన్తితఫలపరితోషణచిన్తామణిరేవ కాఞ్చినిలయా మే ।
చిరతరసుచరితసులభా చిత్తం శిశిరయతు చిత్సుధాధారా ॥౧.౩॥
🌷౧.౩వ శ్లోకం
చిన్తితఫలపరితోషణచిన్తామణిరేవ కాఞ్చినిలయా మే ।
చిరతరసుచరితసులభా చిత్తం శిశిరయతు చిత్సుధాధారా ॥౧.౩॥
🌷పదవిభాగం
చిన్తిత-ఫల-పరితోషణ-చిన్తామణిః ఏవ కాఞ్చి-నిలయా మే । చిరతర-సుచరిత-సులభా చిత్తం శిశిరయతు చిత్-సుధాధారా ॥౧.౩॥
🌷అన్వయం
కాఞ్చీనిలయా చిన్తితఫలపరిపోషణ-చిన్తామణిః ఏవ చిరతర-సుచరితసులభా చిత్సుధాధారా మే చిత్తమ్ శిశిరయతు ॥౧.౩॥
🌷ప్రతిపదార్థం
కాఞ్చీ-నిలయా = కాంచీ నివాసిని యగు కామాక్షీ దేవి
చిన్తితఫలపరిపోషణచిన్తామణిః >
చిన్తిత-ఫల-పరిపోషణ- = చింతించిన ఫలమును పరిపోషించు-
చిన్తామణిః ఏవ = చింతామణియే
చిరతర-సుచరిత-సులభా = ఎంతో కాలము నుంచి చేసిన సత్కర్మాచరణములచే సులభముగా లభించునట్టి
చిత్సుధా-ధారా = చైతన్యామృత ప్రవాహ రూపిణి యగునామె
మే = నా యొక్క
చిత్తమ్ = మనస్సును
శిశిరయతు = చల్లబరచుగాక
🌷తాత్పర్యం
కోరిన కోర్కెలను అన్నియును యిచ్చు చింతామణి బహు జన్మముల పుణ్యఫలమయి అందుబాటగునది కాంచీపుర నివాసినియు అయిన ఒక జ్ఞానామృతధార నా మనసును చల్లబరచుగాక.
No comments:
Post a Comment