🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౨వ శ్లోకం
🌷౧.౧౨వ శ్లోకం
కమ్పాతీరచరాణాం కరుణాకోరకితదృష్టిపాతానామ్ ।
కేలీవనం మనో మే కేషాఞ్చిత్ భవతు చిద్విలాసానామ్ ॥౧.౧౨॥
కేలీవనం మనో మే కేషాఞ్చిత్ భవతు చిద్విలాసానామ్ ॥౧.౧౨॥
🌷పదవిభాగం
కమ్పా-తీర-చరాణాం కరుణా-కోరకిత-దృష్టిపాతానామ్ । కేలీవనం మనో మే కేషాఞ్చిత్ భవతు చిద్విలాసానామ్ ॥౧.౧౨॥
🌷అన్వయం
కమ్పాతీరచరాణాం కరుణాకోరకిత-దృష్టిపాతానాం కేషాఞ్చిత్ చిద్విలాసానాం మే మనః కేలీవనం భవతు ॥౧.౧౨॥
🌷ప్రతిపదార్థం
కమ్పా-తీర-చరాణామ్ = కంపానదీ తీరమున చరించు
కరుణా-కోరకిత-దృష్టి-పాతానామ్ = కరుణ మొగ్గ తొడిగిన కటాక్షములు గల
కేషాఞ్చిత్ = అనిర్వచనీయములయిన
చిద్విలాసానామ్ = చిద్విలాసములకు
మే = నా యొక్క
మనః = మనస్సు
కేలీ-వనమ్ = విహారోద్యానము
భవతు = అగుగాక
🌷తాత్పర్యం
కంపాతీర విహారములు కరుణారసముచే మొగ్గ దొడుగు తళుకు చూపులుగలవియు నగు ఒక చిద్విలాసములకు అనగా కామాక్షికి నా మనస్సు విహారవనము అగుగాక.
No comments:
Post a Comment