🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩౫వ శ్లోకం
ఉరరీకరోమి సన్తతమూష్మలఫాలేన లాలితం పుంసా ।
ఉపకమ్పముచితఖేలనముర్వీధరవంశసమ్పదున్మేషమ్ ॥౧.౩౫॥
🌷౧.౩౫వ శ్లోకం
ఉరరీకరోమి సన్తతమూష్మలఫాలేన లాలితం పుంసా ।
ఉపకమ్పముచితఖేలనముర్వీధరవంశసమ్పదున్మేషమ్ ॥౧.౩౫॥
🌷పదవిభాగం
ఉరరీకరోమి సన్తతమ్ ఊష్మల-ఫాలేన లాలితం పుంసా । ఉపకమ్పమ్ ఉచిత-ఖేలనమ్ ఉర్వీధర-వంశ-సమ్పద్-ఉన్మేషమ్ ॥౧.౩౫॥
🌷అన్వయం
ఊష్మలఫాలేన పుంసా సన్తతం లాలితం ఉపకమ్పమ్ ఉచితఖేలనమ్ ఉర్వీధరవంశసమ్పదున్మేషమ్ ఉరరీకరోమి ॥౧.౩౫॥
🌷ప్రతిపదార్థం
ఊష్మలఫాలేన = అగ్నిఫాలమందుగల
పుంసా = పురుషుని చేత
సన్తతం = ఎల్లప్పుడు
లాలితం = లాలింపబడిన
ఉపకమ్పమ్ = కంపానదీ సమీపమున
ఉచితఖేలనమ్ = తగిన ఆటలు గలిగిన
ఉర్వీధరవంశసమ్పదున్మేషమ్ >
ఉర్వీధరవంశ- = పర్వతవంశపు
సమ్పదున్మేషమ్ = సంపదకు వికాసమయిన అమ్మవారిని
ఉరరీకరోమి = అంగీకరించెదను
🌷తాత్పర్యం
సెగలు చిమ్ము ఫాలము గల పురుషునిచే లాలింపబడునది, కంపాతీరమున ఆటలాడునదియు నగు పర్వత రాజు యొక్క భాగ్యోన్మేషము నెల్లప్పుడు భావింతును.
No comments:
Post a Comment