Wednesday, July 18, 2018

ఆర్యా 1.4

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪వ శ్లోకం
కుటిలకచం కఠినకుచం కున్దస్మితకాన్తికుఙ్కుమచ్ఛాయమ్ ।
కురుతే విహృతిం కాఞ్చ్యామ్ కులపర్వతసార్వభౌమసర్వస్వమ్ ॥౧.౪॥

🌷పదవిభాగం
కుటిల-కచం కఠిన-కుచం కున్దస్మిత-కాన్తి-కుఙ్కుమ-చ్ఛాయం । కురుతే విహృతిం కాఞ్చ్యామ్ కులపర్వత-సార్వభౌమ-సర్వస్వమ్ ॥౧.౪॥

🌷అన్వయం
కుటిలకచం కఠినకుచమ్ కున్దస్మితకాంతి-కుఙ్కుమచ్ఛాయమ్ కులపర్వతసార్వభౌమసర్వస్వమ్ కాఞ్చ్యామ్ విహృతిమ్ కురుతే ॥౧.౪॥

🌷ప్రతిపదార్థం
కుటిలకచం = వంకర తిరిగిన ముంగురులు గల
కఠినకుచమ్ = కఠినములయిన చన్నులు గల
కున్దస్మితకాంతి-కుఙ్కుమచ్ఛాయమ్ >
          కున్దస్మితకాన్తి- = మొల్లల వంటి నవ్వు కాంతి గల
          కుఙ్కుమచ్ఛాయమ్ = కుంకుమ పూవు వంటి కాంతిగల
కుల-పర్వత-సార్వభౌమ-సర్వస్వమ్ = కులపర్వత చక్రవర్తి యొక్క సర్వస్వము
కాఞ్చ్యామ్ = కాంచీపురి యందు
విహృతిమ్ = విహారమును
కురుతే = చేయుచున్నది

🌷తాత్పర్యం
వంకరలు తిరిగిన జుత్తు, బిగువయిన చనుకట్టు, మొల్లలవంటి చిరునవ్వు, తలకు కుంకుమ పువ్వు వంటి నెమ్మేని పొలుపు గలదియై, కులపర్వత సార్వభౌముని సర్వైశ్వర్యమూర్తి కాంచి యందు విహరించుచున్నది.

No comments:

Post a Comment