🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬౮వ శ్లోకం
బాణసృణిపాశకార్ముకపాణిమముం కమపి కామపీఠగతమ్ ।
ఏణధరకోణచూడం శోణిమపరిపాకబేధమాకలయే ॥౧.౬౮॥
🌷౧.౬౮వ శ్లోకం
బాణసృణిపాశకార్ముకపాణిమముం కమపి కామపీఠగతమ్ ।
ఏణధరకోణచూడం శోణిమపరిపాకబేధమాకలయే ॥౧.౬౮॥
🌷పదవిభాగం
బాణ-సృణి-పాశ-కార్ముక-పాణిమ్ అముమ్ కమ్ అపి కామ-పీఠ-గతం । ఏణధర-కోణ-చూడం శోణిమ-పరిపాక-బేధమ్ ఆకలయే ॥౧.౬౮॥
🌷అన్వయం
బాణశృణిపాశకార్ముకపాణిమ్ కామపీఠగతమ్ ఏణధరకోణచూడమ్ శోణిమపరిపాకభేదమ్ అముమ్ కమ్ అపి ఆకలయే ॥౧.౬౮॥
🌷ప్రతిపదార్థం
బాణసృణిపాశకార్ముకపాణిమ్ >
బాణ-శృణి-పాశ- = బాణము పాశము, అంకుశము
కార్ముక-పాణిమ్ = విల్లు చేతుల యందుగల
కామపీఠ-గతమ్ = కామపీఠము నందున్న
ఏణ-ధర-కోణ-చూడమ్ = జింకను ధరించువాని కల శిరమందుగల
శోణిమ-పరిపాక-భేదమ్ = అరుణిమ పాకభేదమైన
అముమ్ = ఈ
కమ్ అపి = ఒకానొక దానిని
ఆకలయే = బాగుగా ధ్యానించెదను
🌷తాత్పర్యం
బాణములు, అంకుశము, పాశము, విల్లు, చేతులందు గల కామ పీఠ గతమయిన చంద్రకలను ధరించిన ఒకానొక అరుణిమ పరిపాక బేధమును బాగుగ ధ్యానించెదను.
No comments:
Post a Comment