🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪౨వ శ్లోకం
కలయామ్యన్తః శశధరకలయాఙ్కితమౌలిమమలచిద్వలయామ్ ।
ఆలయామాగమపీఠీనిలయాం వలయాఙ్కసున్దరీమమ్బామ్ ॥౧.౪౨॥
🌷౧.౪౨వ శ్లోకం
కలయామ్యన్తః శశధరకలయాఙ్కితమౌలిమమలచిద్వలయామ్ ।
ఆలయామాగమపీఠీనిలయాం వలయాఙ్కసున్దరీమమ్బామ్ ॥౧.౪౨॥
🌷పదవిభాగం
కలయామి అన్తః శశధర-కలయా అఙ్కిత-మౌలిమ్ అమలచిద్వలయామ్ । ఆలయామ్ ఆగమ-పీఠీ-నిలయాం వలయ-అఙ్క-సున్దరీమ్ అమ్బామ్ ॥౧.౪౨॥
🌷అన్వయం
శశధరకలయా అఙ్కితమౌలిమ్ అమలచిద్వలయామ్ అలయామ్ ఆగమపీఠీనిలయామ్ వలయాఙ్కసున్దరీమ్ అమ్బామ్ అన్తః కలయామి ॥౧.౪౨॥
🌷ప్రతిపదార్థం
శశధరకలయా = చంద్రకలచేత
అఙ్కితమౌలిమ్ = చిహ్నితమైన శిరముగల
అమలచిద్వలయామ్ = స్వచ్ఛమయిన చైతన్యముతో చుట్టబడిన
అలయామ్ = లయము లేని
ఆగమపీఠీనిలయామ్ = ఆగమ పీఠికయే నిలయముగా గల
వలయాఙ్కసున్దరీమ్ = వలయముల గుర్తులు గల శివుని కాంతయైన
అమ్బామ్ = అమ్మను
అన్తః = లోపల
కలయామి = ధ్యానించెదను
🌷తాత్పర్యం
చంద్రకలా చిహ్నితమయిన శిరముగల స్వచ్ఛచైతన్యముచే చుట్టబడిన లయరహితమయిన ఆగమ పీఠికయందు నివసించు కడియముల చిహ్నములు గల శివుని కాంతయగు అమ్మను మనసులో ధ్యానించెదను.
No comments:
Post a Comment