Thursday, July 26, 2018

ఆర్యా 1.51

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫౧వ శ్లోకం
అధికాఞ్చి కేలిలోలైరఖిలాగమయన్త్రతన్త్రమన్త్రమయైః ।
అతిశీతం మమ హృదయం విషమశరద్రోహిజీవనోపాయైః ॥౧.౫౧॥

🌷పదవిభాగం
అధికాఞ్చి కేలిలోలైః అఖిల-ఆగమ-యన్త్ర-తన్త్ర-మన్త్రమయైః । అతి-శీతం మమ హృదయం విషమ-శర-ద్రోహి-జీవన-ఉపాయైః ॥౧.౫౧॥

🌷అన్వయం
అధికాఞ్చి కేలిలోలైః అఖిలాగమయన్త్రతన్త్రమన్త్రమయైః  విషమశరద్రోహిజీవనోపాయైః మమ హృదయం అతిశీతమ్ ॥౧.౫౧॥

🌷ప్రతిపదార్థం
అధికాఞ్చి = కాంచీనగరమందు
కేలిలోలైః = క్రీడలందాసక్తములైన
అఖిలాగమయన్త్రతన్త్రమన్త్రమయైః = సమస్తములయిన ఆగమములలోని యంత్ర మంత్ర తంత్రములే స్వరూపములుగా గల (తంత్రమంత్రమయై)
విషమశరద్రోహిజీవనోపాయైః = మన్మథుని శత్రువు బ్రతుకు ఉపాయములైన అమ్మవారిచే
మమ = నా యొక్క
హృదయమ్ = మనస్సు
అతిశీతమ్ = మిక్కిలి చల్లబడినది

🌷తాత్పర్యం
కాంచీపురమందు ఆటలాడుట యందు ఇష్టము కలిగిన, అఖిలాగమముల యందలి యంత్ర తంత్ర మంత్రములు స్వరూపములుగా గలిగిన శివుని జీవనోపాయ రూపమయిన అమ్మవారి వలన నా
మనసు చల్లబడియున్నది.

No comments:

Post a Comment