🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩౨వ శ్లోకం
కురువిన్దగోత్రగాత్రం కూలచరం కమపి నౌమి కమ్పాయాః ।
కూలఙ్కషకుచకుమ్భం కుసుమాయుధవీర్యసారసంరమ్భమ్ ॥౧.౩౨॥
🌷౧.౩౨వ శ్లోకం
కురువిన్దగోత్రగాత్రం కూలచరం కమపి నౌమి కమ్పాయాః ।
కూలఙ్కషకుచకుమ్భం కుసుమాయుధవీర్యసారసంరమ్భమ్ ॥౧.౩౨॥
🌷పదవిభాగం
కురువిన్ద-గోత్ర-గాత్రం కూలచరం కమపి నౌమి కమ్పాయాః । కూలఙ్కష-కుచ-కుమ్భం కుసుమ-ఆయుధ-వీర్య-సార-సంరమ్భమ్ ॥౧.౩౨॥
🌷అన్వయం
కురువిన్దగోత్రగాత్రం కూలచరం కమపి కమ్పాయాః కూలఙ్కషకుచకుమ్భం కుసుమాయుధవీర్యసార-సంరమ్భం నౌమి ॥౧.౩౨॥
🌷ప్రతిపదార్థం
కురువిన్ద-గోత్ర-గాత్రం = కురువింద మణుల గోత్రమునందు పుట్టినట్లున్న శరీరముగల
కమ్పాయాః = కంపానది యొక్క
కూలచరమ్ = ఒడ్డున తిరుగు
కమ్ అపి = ఒకానొక
కూలఙ్కష-కుచ-కుమ్భం = ఒడ్లను ఒరయు కుండలవంటి కుచములు గల
కుసుమాయుధ- = మన్మథుని
వీర్యసార- = పరాక్రమసారముయొక్క
సంరమ్భమ్ = వేగమును
నౌమి = నమస్కరించెదను
🌷తాత్పర్యం
పగడములవంటి శరీర వర్ణము కలిగినది, కుచ కుంభముల ఒప్పు గలిగినది, మన్మథుని పరాక్రమ
సారభూతమైన సంరంభము గలిగి కంపాతటమందు వర్తించు ఒకానొక వస్తువును నమస్కరించెదను.
No comments:
Post a Comment