🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬౪వ శ్లోకం
కేనాపి మిలద్దేహా యూనా స్వాహాసహాయతిలకేన ।
సహకారమూలదేశే సంవిద్రూపా కుటుమ్బినీ రమతే ॥౧.౬౪॥
🌷౧.౬౪వ శ్లోకం
కేనాపి మిలద్దేహా యూనా స్వాహాసహాయతిలకేన ।
సహకారమూలదేశే సంవిద్రూపా కుటుమ్బినీ రమతే ॥౧.౬౪॥
🌷పదవిభాగం
కేన అపి మిలద్-దేహా యూనా స్వాహా-సహాయ-తిలకేన । సహకార-మూలదేశే సంవిద్రూపా కుటుమ్బినీ రమతే ॥౧.౬౪॥
🌷అన్వయం
స్వాహాసహాయతిలకేన యూనా మిలద్దేహా సంవిద్రూపా కుటుమ్బినీ సహకారమూలదేహే రమతే ॥౧.౬౪॥
🌷ప్రతిపదార్థం
స్వాహా-సహాయ-తిలకేన = స్వాహాదేవి సహాయముగా గల వాడు తిలకముగా గల--అగ్ని
యూనా = యువకుని చేత
మిలద్-దేహా = కలియుచున్న దేహముగల
సంవిద్-రూపా = జ్ఞాన రూపిణియైన
కుటుమ్బినీ = ఇల్లాలు
సహకార-మూలదేహే = మామిడి చెట్టు మూలము గల దేశమున
రమతే = రమించుచున్నది
🌷తాత్పర్యం
అగ్నితిలకుడైన అనగా స్వాహా దేవి సహాయముగా గలిగిన ఒకానొక యువకుడైన శివుని దేహముతో తన దేహమును చేర్చి అతని కుటుంబిని యగు కామాక్షీ దేవి మామిడి చెట్టు కింది భూమి పై రమించుచున్నది.
No comments:
Post a Comment