🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬౭వ శ్లోకం
అధికాఞ్చి వర్తమానామతులాం కరవాణిపారణామక్ష్ణోః ।
ఆనన్దపాకబేధామరుణిమపరిణామగర్వపల్లవితామ్ ॥౧.౬౭॥
🌷౧.౬౭వ శ్లోకం
అధికాఞ్చి వర్తమానామతులాం కరవాణిపారణామక్ష్ణోః ।
ఆనన్దపాకబేధామరుణిమపరిణామగర్వపల్లవితామ్ ॥౧.౬౭॥
🌷పదవిభాగం
అధికాఞ్చి వర్తమానామ్ అతులాం కరవాణి పారణామ్ అక్ష్ణోః । ఆనన్ద-పాకబేధామ్ అరుణిమ-పరిణామ-గర్వ-పల్లవితామ్ ॥౧.౬౭॥
🌷అన్వయం
అధికాఞ్చి వర్తమానామ్ అతులామ్ ఆనన్దపాకభేదామ్ అరుణిమ పరిణామ గర్వపల్లవితామ్ అక్ష్ణోః పారణామ్ కరవాణి ॥౧.౬౭॥
🌷ప్రతిపదార్థం
అధి-కాఞ్చి = కాంచీనగరమందు
వర్తమానామ్ = నివసించుచున్న
అతులామ్ = సాటిలేని
ఆనన్ద-పాక-భేదామ్ = ఆనంద పాక విశేషమైన
అరుణిమపరిణామగర్వపల్లవితామ్ >
అరుణిమ- = ఎఱుపు దనపు
పరిణామ- = పరిణామము యొక్క
గర్వ-పల్లవితామ్ = గర్వముచే పల్లవించిన అమ్మవారిని
అక్ష్ణోః = కన్నులకు
పారణామ్ = విందును
కరవాణి = చేసికొందును గాక
🌷తాత్పర్యం
కాంచీనగరి యందు నివసించునట్టి సాటిలేని ఆనంద పాక విశేషమయిన అరుణ్య పరిణామ గర్వము పల్లవించినట్లు ఉన్న అమ్మవారిని నా కన్నులకు విందు చేసికొందును గాక.
No comments:
Post a Comment