Wednesday, July 18, 2018

ఆర్యా 1.8

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮వ శ్లోకం
శ్రితకమ్పాసీమానం శిథిలితపరమశివధైర్యమహిమానమ్ ।
కలయే పాటలిమానం కఞ్చన కఞ్చుకితభువనభూమానమ్ ॥౧.౮॥

🌷పదవిభాగం
శ్రిత-కమ్పా-సీమానం శిథిలిత-పరమ-శివ-ధైర్య-మహిమానమ్ । కలయే పాటలి-మానం కఞ్చన కఞ్చుకిత-భువన-భూమానమ్ ॥౧.౮॥

🌷అన్వయం
శ్రితకమ్పాసీమానం శిథిలితపరమశివ-ధైర్యమహిమానం కఞ్చుకిత-భువనభూమానమ్ కఞ్చన పాటలిమానమ్ కలయే ॥౧.౮॥

🌷ప్రతిపదార్థం
శ్రిత-కమ్పా-సీమానం = కంపానదీ తీరభూమిని ఆశ్రయించిన
శిథిలితపరమశివ-ధైర్యమహిమానం >
          శిథిలిత- = శిథిలమయిన-
          పరమశివ- =  శివుని యొక్క-
          ధైర్య-మహిమానం = ధైర్య మహిమగల
కఞ్చుకిత-భువనభూమానమ్ >
          కఞ్చుకిత- = కంచుకముగా చేసుకొన్న-
          భువన-భూమానమ్ = భూమి వైశాల్యము గల
కఞ్చన = ఒకానొక
పాటలి-మానమ్ = ఎఱుపును
కలయే = ధ్యానించెదను

🌷తాత్పర్యం
పరమశివుని ధైర్యము బిగి సడలింప జేయునట్టిదియు, సకల భువనాంతరమయిన పూర్ణ వస్తువును భువనములకు కంచుకమువలె రక్షయు అయిన కంపాతీర సమాశ్రయమయిన ఒకానొక యెరుపును రక్తితో భావించెదను.

No comments:

Post a Comment