🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫౭వ శ్లోకం
మూకోఽపి జటిలదుర్గతిశోకోఽపి స్మరతి యః క్షణం భవతీమ్ ।
ఏకో భవతి స జన్తుః లోకోత్తరకీర్తిరేవ కామాక్షి ॥౧.౫౭॥
🌷౧.౫౭వ శ్లోకం
మూకోఽపి జటిలదుర్గతిశోకోఽపి స్మరతి యః క్షణం భవతీమ్ ।
ఏకో భవతి స జన్తుః లోకోత్తరకీర్తిరేవ కామాక్షి ॥౧.౫౭॥
🌷పదవిభాగం
మూకః అపి జటిల-దుర్గతి-శోకః అపి స్మరతి యః క్షణం భవతీమ్ । ఏకః భవతి స జన్తుః లోక-ఉత్తర-కీర్తిః ఏవ కామాక్షి ॥౧.౫౭॥
🌷అన్వయం
కామాక్షి మూకః అపి జటిలదుర్గతిశోకః అపి యః క్షణం భవతీమ్ స్మరతి సః ఏకః జన్తుః లోకోత్తరకీర్తిః భవతి ॥౧.౫౭॥
🌷ప్రతిపదార్థం
కామాక్షి = ఓ కామాక్షీదేవీ
మూకః అపి = మూగ అయినను
జటిల-దుర్గతి-శోకః అపి = తీవ్రమయిన క్లేశ సముదాయము చే శోకము కలవాడయినను
యః = ఎవడు
క్షణం = క్షణకాలము
భవతీమ్ = నిన్ను
స్మరతి = తలచునో
సః = ఆ
ఏకః = ఒక
జన్తుః = ప్రాణియే
లోక-ఉత్తర-కీర్తిః = లోకాతిశయ కీర్తి కలవాడు
భవతి = అగును
🌷తాత్పర్యం
🌷మూగవాడయినా తీవ్ర దారిద్ర్యాది దుర్గతి శోకుడయినా ఆ ప్రాణి నిన్ను క్షణకాలము స్మరియించిన మాత్రమున లోకోత్తర కీర్తి కలవాడు అగును.
No comments:
Post a Comment