🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౯వ శ్లోకం
లీనస్థితి మునిహృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకమ్పమ్ ।
పీనస్తనభరమీడే మీనధ్వజతన్త్రపరమతాత్పర్యమ్ ॥౧.౧౯॥
🌷౧.౧౯వ శ్లోకం
లీనస్థితి మునిహృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకమ్పమ్ ।
పీనస్తనభరమీడే మీనధ్వజతన్త్రపరమతాత్పర్యమ్ ॥౧.౧౯॥
🌷పదవిభాగం
లీనస్థితి ముని-హృదయే ధ్యాన-స్థిమితం తపస్యద్ ఉపకమ్పమ్ । పీనస్తన-భరమ్ ఈడే మీన-ధ్వజ-తన్త్ర-పరమ-తాత్పర్యమ్ ॥౧.౧౯॥
🌷అన్వయం
మునిహృదయే లీనస్థితి ధ్యానస్థిమితం ఉపకమ్పమ్ తపస్యత్ పీనస్తనభరమ్ మీనధ్వజతన్త్ర-పరమతాత్పర్యమ్ ఈడే ॥౧.౧౯॥
🌷ప్రతిపదార్థం
ముని-హృదయే = మునుల హృదయమున
లీనస్థితి = లీనమయిన స్థితి కలిగిన
ధ్యాన-స్థిమితం = ధ్యాన నిశ్చలమయిన
ఉపకమ్పమ్ = కంపానదీ సమీపమున
తపస్యత్ = తపమొనర్చుచున్న
పీన-స్తనభరమ్ = బలిసిన స్తనముల బరువు కల
మీనధ్వజతన్త్ర-పరమతాత్పర్యమ్ >
మీన-ధ్వజ-తన్త్ర- = కాదివిద్యా తంత్రము యొక్క
పరమ-తాత్పర్యమ్ = పరమ తాత్పర్యమును
ఈడే = స్తుతించెదను
🌷తాత్పర్యం
మునుల హృదయము నందు లీనమయి, ధ్యానమందు నిలుకడగొని కంపానది ఒడ్దున తపము చేయునది, నిండు పాలిండ్ల కులుకుదనము గలది యగు కామశాస్త్ర పరమ తాత్పర్యమును నుతింతును. అంబికా చక్రమునకిది గుర్తు.
No comments:
Post a Comment