Thursday, July 26, 2018

ఆర్యా 1.43

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪౩వ శ్లోకం
శర్వాదిపరమసాధకగుర్వానీతాయ కామపీఠజుషే ।
సర్వాకృతయే శోణిమగర్వాయ సమర్ప్యతే హృదయమ్ ॥౧.౪౩॥

🌷పదవిభాగం
శర్వ-ఆది-పరమ-సాధక-గురు-ఆనీతాయ కామ-పీఠజుషే సర్వ-ఆకృతయే శోణిమ-గర్వాయ సమర్ప్యతే హృదయమ్ ॥౧.౪౩॥

🌷అన్వయం
శర్వాదిపరమసాధకగుర్వానీతాయ కామపీఠజుషే సర్వాకృతయే శోణిమగర్వాయ హృదయం సమర్ప్యతే ॥౧.౪౩॥

🌷ప్రతిపదార్థం
శర్వాదిపరమసాధకగుర్వానీతాయ = శివుడు మొదలయిన పరమ సాధక గురువుల చేతే బడిన
కామపీఠజుషే = కామ పీఠమును పొందిన
సర్వాకృతయే = అన్ని ఆకృతులు గల
శోణిమగర్వాయ = ఎఱుపు గర్వము కొరకు
హృదయమ్ = మనస్సు
సమర్ప్యతే = సమర్పించబడుతున్నది

🌷తాత్పర్యం
శివాది పరమసాధక గురువులచే తేబడిన కామపీఠమున పొందిన అన్ని ఆకృతులు గల ఎఱుపు గర్వమనదగిన అమ్మవారికి హృదయము సమర్పించబడుచున్నది.

No comments:

Post a Comment