Friday, July 27, 2018

ఆర్యా 1.62

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬౨వ శ్లోకం
ప్రేమవతీ కమ్పాయాం స్థేమవతీ యతిమనఃసు భూమవతీ ।
సామవతీ నిత్యగిరాం సోమవతీ శిరసి భాతి హైమవతీ ॥౧.౬౨॥

🌷పదవిభాగం
ప్రేమవతీ కమ్పాయాం స్థేమవతీ యతి-మనఃసు భూమవతీ । సామవతీ నిత్యగిరాం సోమవతీ శిరసి భాతి హైమవతీ ॥౧.౬౨॥

🌷అన్వయం
కమ్పాయాం ప్రేమవతీ, యతిమనఃసు స్థేమవతీ, సత్యగిరాం సామవతీ, శిరసి సోమవతీ, భూమవతీ హైమవతీ భాతి ॥౧.౬౨॥

🌷ప్రతిపదార్థం
కమ్పాయామ్ = కంపానది యందు
ప్రేమవతీ = ప్రేమ గలది
యతిమనఃసు = యతుల మనస్సులందు
స్థేమవతీ = స్థిరత్వముగలది
సత్యగిరామ్ = సత్యవాక్కులలో
సామవతీ = సామము గలది
శిరసి = శిరస్సునందు
సోమవతీ = చంద్రుడు గలది
భూమవతీ = సర్వాతిశయాధిక్యము గలదియు నైన
హైమవతీ = హిమవత్పర్వత పుత్రిక
భాతి = ప్రకాశించుచున్నది

🌷తాత్పర్యం
అమ్మవారు కంపానదియందు ప్రేమకలది. యతుల మనస్సులందు స్థిరముగా నుండునది. శిరసునందు చంద్రుని ధరించునది. సత్యవాక్కులు అనదగిన వేదములలో సామవేదము స్వరూపముగా గలది. సర్వాతిశయాధిక్యము గలదియునైన హిమవత్పర్వత పుత్రికయగు అమ్మవారు అంతట ప్రకాశిస్తున్నది.

No comments:

Post a Comment