Wednesday, July 18, 2018

ఆర్యా 1.7

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౭వ శ్లోకం
ఐశ్వర్యమిన్దుమౌలేరైకాత్మ్వప్రకృతికాఞ్చిమధ్యగతమ్ ।
ఐన్దవకిశోరశేఖరమైదమ్పర్యం చకాస్తి నిగమనామ్ ॥౧.౭॥

🌷పదవిభాగం
ఐశ్వర్యమ్ ఇన్దుమౌలేః ఐకాత్మ్వ-ప్రకృతి-కాఞ్చి-మధ్యగతమ్ । ఐన్దవ-కిశోర-శేఖరమ్ ఐదమ్పర్యం చకాస్తి నిగమనామ్ ॥౧.౭॥

🌷అన్వయం
ఇన్దుమౌలేః ఐశ్వర్యమ్ ఐకాత్మప్రకృతి-కాఞ్చిమధ్యగతమ్ ఐన్దవ-కిశోరశేఖరం నిగమానామ్ ఐదమ్పర్యం చకాస్తి ॥౧.౭॥

🌷ప్రతిపదార్థం
ఇన్దుమౌలేః = చంద్రుడు శిరమున గల శివుని యొక్క
ఐశ్వర్యమ్ = ఐశ్వర్యము

ఐకాత్మప్రకృతి-కాఞ్చిమధ్యగతమ్ >         
          ఐకాత్మ-ప్రకృతి- = జీవేశ్వర్యైక్య జ్ఞాన హేతువు-
          కాఞ్చి-మధ్యగతమ్ = కాంచీనగర మధ్యమున ఉన్న
ఐన్దవ-కిశోర-శేఖరమ్ = నెలబాలుడు శిరోభూషణముగా గల
నిగమానామ్ = వేదముల యొక్క
ఐదమ్పర్యమ్ = తాత్పర్యము
చకాస్తి =  ప్రకాశించుచున్నది

🌷తాత్పర్యం
ఇందుశేఖరుని ఏకాత్మ భావ స్వభావమైన ఐశ్వర్యము బాలేందుశేఖరము. వేదముల యొక్క సిద్ధాంతార్థమునైన వస్తువు కాంచీపురము మధ్యలో భాసిల్లుచున్నది.

No comments:

Post a Comment