Thursday, July 26, 2018

ఆర్యా 1.23

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨౩వ శ్లోకం
తనిమాద్వైతవలగ్నం తరుణారుణసమ్ప్రదాయతనులేఖమ్ ।
తటసీమని కమ్పాయాస్తరుణిమసర్వస్వమాద్యమద్రాక్షమ్ ॥౧.౨౩॥


🌷పదవిభాగం
తనిమా-అద్వైత-వలగ్నం తరుణ-అరుణ-సమ్ప్రదాయ-తను-లేఖమ్ । తటసీమని కమ్పాయాః తరుణిమ్ అసర్వస్వమ్ ఆద్యమ్ అద్రాక్షమ్ ॥౧.౨౩॥


🌷అన్వయం
కమ్పాయాః తటసీమ్ని తనిమాద్వైతవలగ్నమ్ తరుణారుణసమ్ప్రదాయతనులేఖమ్ ఆద్యమ్ తరుణిమసర్వస్వమ్ అద్రాక్షమ్ ॥౧.౨౩॥


🌷ప్రతిపదార్థం
కమ్పాయాః = కంపానదియొక్క
తటసీమ్ని = తీరప్రదేశమున
తనిమా-అద్వైత-వలగ్నమ్ = కార్శ్వముతో అభేధమొందిన నడుము గల
తరుణ-అరుణ-సమ్ప్రదాయ-తను-లేఖమ్ = తరుణారున సంప్రదాయ రూపమయిన తను రేఖ గల
ఆద్యమ్ = మొదటి
తరుణిమ-సర్వస్వమ్ = యౌవన సర్వస్వమును
అద్రాక్షమ్ = చూచితిని


🌷తాత్పర్యం
సన్నని నడుము, లేత యెరుపు రంగు తోడి శరీరము గల ఆద్యమగు ఒక నడిప్రాయపు నిండుదనము గలిగి, కంపాతీరము నందు ఉండెడి సచ్చిదానందమూర్తిని కృపాశోభతో కూడిన ఒక బాలికామూర్తిని చూచితిని.

No comments:

Post a Comment