Thursday, July 26, 2018

ఆర్యా 1.46

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪౬వ శ్లోకం
కుణ్డలి కుమారి కుటిలే చణ్డి చరాచరసవిత్రి చాముణ్డే ।
గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి ॥౧.౪౬॥

🌷పదవిభాగం
కుణ్డలి కుమారి కుటిలే చణ్డి చర-అచర-సవిత్రి చాముణ్డే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి ॥౧.౪౬॥

🌷అన్వయం
కుణ్డలి కుమారి కుటిలే చణ్డి చరాచరసవిత్రి చాముణ్డే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే కామాక్షి  త్వామ్ నమామి ॥౧.౪౬॥

🌷ప్రతిపదార్థం
కుణ్డలి కుమారి = నాగ కన్యవి
కుటిలే = వంకర నడకల దానివి
చణ్డి = కోప స్వభావముగల దానివి
చరాచర-సవిత్రి = చరాచరములకు తల్లివి
చాముణ్డే = చండముండ సంహారము చేసిన దానవగు
గుణిని = గుణములు కల దానవగు
గుహారిణి = గుహవు, అరణివి అగు
గుహ్యే = గుహలో ఉన్నదానవైన
గురు-మూర్తే = గురు స్వరూపిణివైన
కామాక్షి = ఓ కామాక్షీదేవీ
త్వామ్ = నిన్ను గూర్చి
నమామి = నమస్కరించెదను

🌷తాత్పర్యం
అమ్మవారు వంకరలు తిరుగు కుండలిని అనబడు నాగకన్యక కోపస్వభావము గలది. చరాచరములకు తల్లి. గుణవతి. చండ ముండుల సంహర్త్రి. గుహారూపిణి. అరణి రూపిణి. గుహలో నుండునది. గురు స్వరూపిణి. అట్టి తల్లికి నమస్సులు.

No comments:

Post a Comment