Thursday, July 26, 2018

ఆర్యా 1.34

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩౪వ శ్లోకం
అఙ్కితకచేన కేనచిదన్ధం కరణౌషధేన కమలానామ్ ।
అన్తఃపురేణ శమ్భోరలఙ్క్రియా కాపి కల్ప్యతే కాఞ్చ్యామ్ ॥౧.౩౪॥

🌷పదవిభాగం
అఙ్కిత-కచేన కేనచిద్ అన్ధఃకరణ-ఔషధేన కమలానామ్ । అన్తఃపురేణ శమ్భోః అలఙ్క్రియా కా అపి కల్ప్యతే కాఞ్చ్యామ్ ॥౧.౩౪॥

🌷అన్వయం
కేనచిద్ కమలానామ్ అన్ధఃకరణౌషధేన అఙ్కిత-కచేన శమ్భోః అన్తఃపురేణ అలఙ్క్రియా కాఞ్చ్యాం కా అపి కల్ప్యతే ॥౧.౩౪॥

🌷ప్రతిపదార్థం
కేనచిత్ = ఒకానొక
కమలానామ్ = కమలముల యొక్క
అంధఃకరణౌషధేన = గుడ్డి తనము కలుగచేయు ఔషధము చేత
అఙ్కితకచేన = చిహ్నితములయిన కచములు గల
శమ్భోః = శివునియొక్క
అన్తఃపురేణ = అంతఃపురము చేత
కాఞ్చ్యామ్ = కాంచీనగరమందు
కా అపి = ఒకానొక
అలఙ్క్రియా = అలంకారము
కల్ప్యతే = కల్పించబడుచున్నది

🌷తాత్పర్యం
కమలములు కనుమూయుటకు కారణమయిన ఔషధముచే నలరు వేనలి గల శంకరుని అంతఃపురముచే కాంచీపురము నందు ఒకానొక అందము తీర్చిదిద్దబడుచున్నది.

No comments:

Post a Comment