Wednesday, July 18, 2018

ఆర్యా 1.6

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬వ శ్లోకం
పరయా కాఞ్చీపురయా పర్వతపర్యాయపీనకుచభరయా ।
పరతన్త్రా వయమనయా పఙ్కజసబ్రహ్మచారిలోచనయా ॥౧.౬॥

🌷పదవిభాగం
పరయా కాఞ్చీ-పురయా పర్వత-పర్యాయ-పీన-కుచ-భరయా । పరతన్త్రాః వయమ్ అనయా పఙ్కజ-సబ్రహ్మచారి-లోచనయా ॥౧.౬॥

🌷అన్వయం
పరయా కాఞ్చీపురయా పర్వతపర్యాయ-పీనకుచభరయా పఙ్కజసబ్రహ్మచారిలోచనయా అనయా  వయం పరతన్త్రాః ॥౧.౬॥

🌷ప్రతిపదార్థం
పరయా = శ్రేష్ఠురాలయిన
కాఞ్చీ-పురయా = కాంచీపురమునే తననగరముగా చేసుకున్న


పర్వతపర్యాయ-పీనకుచభరయా >
          పర్వత-పర్యాయ- = పర్వతవాచి శబ్దములకు పర్యాయమైన-
          పీన-కుచభరయా = కుచశబ్దముచే చెప్పబడు స్తనముల బరువుకల
పఙ్కజ-సబ్రహ్మచారి-లోచనయా =  కమలములకు సహపాఠులగు కన్నులు గల
అనయా  = ఈమె చేత
వయమ్ = మేము
పరతన్త్రాః = దాసులము

🌷తాత్పర్యం
పర్వతములకు పర్యాయములయిన వలుద పాలిండ్ల బరువుతో పద్మములకు సాటియగు కన్నులతో శోభించు కాంచీపుర నివాసినియగు ఈ పరదేవతచే మేము మైమరచి యున్నాము.

No comments:

Post a Comment