🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨౭వ శ్లోకం
ఉరరీకృతకాఞ్చిపురీముపనిషదరవిన్దకుహరమధుధారామ్ ।
ఉన్నమ్రస్తనకలశీముత్సవలహరీముపాస్మహే శమ్భోః ॥౧.౨౭॥
🌷పదవిభాగం
ఉరరీకృత-కాఞ్చి-పురీమ్ ఉపనిషద్-అరవిన్ద-కుహర-మధుధారామ్ । ఉన్నమ్ర-స్తన-కలశీమ్ ఉత్సవ-లహరీమ్ ఉపాస్మహే శమ్భోః ॥౧.౨౭॥
🌷అన్వయం
🌷ప్రతిపదార్థం
ఉరరీకృతకాఞ్చిపురీమ్>
ఉరరీకృత- = అంగీకరించిన
కాంచిపురీమ్ = కాంచీనగరముగలది
ఉపనిషద్-అరవిన్ద-కుహర-మధు-ధారామ్ = వేదాంతకమల గర్భ మధుధారయగు
ఉన్నమ్ర-స్తన-కలశీమ్ = ఎత్తయిన కలశముల వంటి స్తనములు గల
శమ్భోః = శివుని యొక్క
ఉత్సవ-లహరీమ్ = సంతోష ప్రవాహమును
ఉపాస్మహే = ఉపాసించెదను
🌷తాత్పర్యం
ఉపనిషత్తులనెడి పద్మములయందు జాలువారు తేనెల సోనయై, కాంచీపుర విహార కుతూహలియు, సమున్నత కుచ కలశయునై యున్న శంభుని పరమోత్సవ ప్రవాహమును ఉపాసింతును.

ఉరరీకృతకాఞ్చిపురీమ్ ఉపనిషదరవిన్దకుహర-మధుధారామ్ ఉన్నమ్రస్తనకలశీం శమ్భోః ఉత్సవలహరీమ్ ఉపాస్మహే
॥౧.౨౭॥
ఉరరీకృతకాఞ్చిపురీమ్>
ఉరరీకృత- = అంగీకరించిన
కాంచిపురీమ్ = కాంచీనగరముగలది
ఉపనిషద్-అరవిన్ద-కుహర-మధు-ధారామ్ = వేదాంతకమల గర్భ మధుధారయగు
ఉన్నమ్ర-స్తన-కలశీమ్ = ఎత్తయిన కలశముల వంటి స్తనములు గల
శమ్భోః = శివుని యొక్క
ఉత్సవ-లహరీమ్ = సంతోష ప్రవాహమును
ఉపాస్మహే = ఉపాసించెదను
🌷తాత్పర్యం
ఉపనిషత్తులనెడి పద్మములయందు జాలువారు తేనెల సోనయై, కాంచీపుర విహార కుతూహలియు, సమున్నత కుచ కలశయునై యున్న శంభుని పరమోత్సవ ప్రవాహమును ఉపాసింతును.
No comments:
Post a Comment