Thursday, July 26, 2018

ఆర్యా 1.14

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౪వ శ్లోకం
అధికాఞ్చి పరమయోగిభిరాదిమపరపీఠసీమ్ని దృశ్యేన ।
అనుబద్ధం మమ మానసమరుణిమసర్వస్వసమ్ప్రదాయేన ॥౧.౧౪॥

🌷పదవిభాగం
అధికాఞ్చి పరమ-యోగిభిః ఆదిమ-పర-పీఠ-సీమ్ని దృశ్యేన । అనుబద్ధం మమ మానసమ్ అరుణిమ-సర్వస్వ-సమ్ప్రదాయేన ॥౧.౧౪॥

🌷అన్వయం
అధికాఞ్చి ఆదిమపరపీఠసీమ్ని పరమయోగిభిః దృశ్యేన అరుణిమసర్వస్వ-సమ్ప్రదాయేన మమ మానసమ్ అనుబద్ధమ్ ॥౧.౧౪॥

🌷ప్రతిపదార్థం
అధికాఞ్చి = కాంచీనగరియందు
ఆదిమ-పర-పీఠ-సీమ్ని = మొదటి, శ్రేష్ఠమయిన పరమ శివుడను పీఠప్రదేశమున
పరమ-యోగిభిః = శ్రేష్ఠయోగులచేత
దృశ్యేన = చూడదగిన
అరుణిమ-సర్వస్వ-సమ్ప్రదాయేన = పూర్ణారుణిమ సంప్రదాయము చేత
మమ = నాయొక్క
మానసమ్ = మనస్సు
అనుబద్ధమ్ = అనుబంధించబడినది

🌷తాత్పర్యం
కంచియందు పరమ యోగులచే ఆదిమహాపీఠమందు దర్శనీయమై యున్న యెరుపు యొక్క నిండుదనపు పరిపాటితో నా మనసత్తుకున్నది.

No comments:

Post a Comment