🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬౧వ శ్లోకం
తుష్యామి హర్షితస్మరశాసనయా కాఞ్చిపురికృతాసనయా ।
స్వాసనయా సకలజగద్భాసనయా కలితశమ్బరాసనయా ॥౧.౬౧॥
🌷౧.౬౧వ శ్లోకం
తుష్యామి హర్షితస్మరశాసనయా కాఞ్చిపురికృతాసనయా ।
స్వాసనయా సకలజగద్భాసనయా కలితశమ్బరాసనయా ॥౧.౬౧॥
🌷పదవిభాగం
తుష్యామి హర్షిత-స్మర-శాసనయా కాఞ్చి-పురి-కృత-ఆసనయా । స్వాసనయా సకల-జగద్-భాసనయా కలిత-శమ్బర-ఆసనయా ॥౧.౬౧॥
🌷అన్వయం
హర్షితస్మరశాసనయా కాఞ్చిపురికృతాసనయా స్వాసనయా సకలజగద్భాసనయా కలితశమ్బరాసనయా తుష్యామి ॥౧.౬౧॥
🌷ప్రతిపదార్థం
హర్షిత-స్మర-శాసనయా = సంతోషపెట్టబడిన మన్మథుని శాసించినవాడు గలది
కాఞ్చి-పురి-కృత-ఆసనయా = కాంచీ పురి యందు చేయబడిన ఆసనముగలది
స్వాసనయా = తన యందు కూర్చున్నట్టిది
సకల-జగద్-భాసనయా = సకల జగములను భాసింపజేయునది
కలిత-శమ్బర-ఆసనయా = కూర్చబడ్డ జలము యొక్క ఆసనముగల అమ్మవారి చేత
తుష్యామి = సంతోషించెదను
🌷తాత్పర్యం
శివుని సంతోషింపజేయునది కాంచీపురమందు నివసించునది తనలోనే ఉండునట్టిది సకల జగములు ప్రకాశింపజేయునది జలమందు ఆసనమును ఏర్పరచుకొన్నదియు నైన అమ్మవారిచే సంతోషము కలుగుచున్నది.
No comments:
Post a Comment