Thursday, July 26, 2018

ఆర్యా 1.30

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩౦వ శ్లోకం
కుతుకజుషి కాఞ్చిదేశే కుముదతపోరాశిపాకశేఖరితే ।
కురుతే జనో మనోఽయం కులగిరిపరిబృఢకులైకమణిదీపే ॥౧.౨౯॥

🌷పదవిభాగం
కుతుక-జుషి కాఞ్చి-దేశే కుముద-తపో-రాశి-పాక-శేఖరితే । కురుతే జనో మనః అయం కులగిరి-పరిబృఢ-కుల-ఏక-మణిదీపే ॥౧.౨౯॥

🌷అన్వయం
అయం జనః కుతుకజుషి కాఞ్చిదేశే కుముదతపోరాశి-పాకశేఖరితే కులగిరిపరిబృఢ-కులైకమణిదీపే మనః కురుతే ॥౧.౨౯॥

🌷ప్రతిపదార్థం
అయమ్ = ఈ
జనః = జనుడు
కాఞ్చిదేశే = కాంచీనగర ప్రదేశమున
కుతుకజుషి = కుతూహలము పొందిన
కుముదతపోరాశిపాకశేఖరితే = చంద్రుడు శిరోభూషణముగా గల
కులగిరివరిబృఢకులైకమణిదీపే >

          కులగిరి- = కుల పర్వతములకు
          పరిబృఢ- = ప్రభువగుహిమవంతుని
          కుల-ఏక-మణిదీపే = కులమునకు మణిదీపమగు అమ్మవారి యందు
మనః కురుతే = మనస్సు కలిగియున్నాడు

🌷తాత్పర్యం
కాంచీదేశమనిన ముచ్చట పడునది, కలువల తపోపరిపాకమును కిరీటముగ ధరించునది, కులపర్వత సార్వభౌముడయిన హిమవంతుని ఇంటి మణిదీపమయిన కామాక్షీదేవిని మనస్సులో పెట్టుకొనినాడు.

No comments:

Post a Comment