Thursday, July 26, 2018

ఆర్యా 1.36

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩౬వ శ్లోకం
అఙ్కురితస్తనకోరకమఙ్కాలఙ్కారమేకచూతపతేః ।
ఆలోకేమహి కోమలమాగమసంలాపసారయాథార్ధ్యమ్ ॥౧.౩౬॥

🌷పదవిభాగం
అఙ్కురిత-స్తన-కోరక్ అఙ్క-అలఙ్కారమ్ ఏక-చూతపతేః ఆలోకేమహి కోమలమ్ ఆగమ-సంలాప-సార-యాథార్ధ్యమ్ ॥౧.౩౬॥

🌷అన్వయం
కోమలమ్ అఙ్కురిత-స్తనకోరకమ్ ఏకచూతపతేః అఙ్కాలఙ్కారం ఆగమసంలాప-సారయాథార్ధ్యమ్ ఏకమ్ ఆలోకేమహి ॥౧.౩౬॥

🌷ప్రతిపదార్థం
కోమలమ్ = మృదువయిన
అఙ్కురిత-స్తనకోరకమ్ = అంకురించిన స్తనములను మొగ్గలుగల
ఏకచూతపతేః = ఏకామ్రేశ్వరుని
అఙ్కాలఙ్కారం = అంకమునకు అలంకారమైన
ఆగమసంలాపసారయాథార్ధ్యమ్ >

          ఆగమసల్లాప- = వేదాలాపముల
          సారయాథార్ధ్యమ్ = సారసత్యమైన
ఏకమ్ = ఒకదానిని-అమ్మవారిని
ఆలోకేమహి = చూచెదము గాక

🌷తాత్పర్యం
ఏకామ్రనాథుని అంకపీఠమునకు అలంకారమై అంకురించు కుచకుట్మములతో ఇంపు గులుకుచు, వేదగోష్ఠికెల్ల సారభూతమై యున్న యొకానొక సత్యమును ముని హృదయ దీపిక యగుదానిని చూచుచున్నాను.

No comments:

Post a Comment