🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩౯వ శ్లోకం
మధుకరసహచరచికురైర్మదనాగమసమయదీక్షితకటాక్షైః ।
మణ్డితకమ్పాతీరైర్మఙ్గలకన్దైర్మమాస్తు సారూప్యమ్ ॥౧.౩౯॥
🌷౧.౩౯వ శ్లోకం
మధుకరసహచరచికురైర్మదనాగమసమయదీక్షితకటాక్షైః ।
మణ్డితకమ్పాతీరైర్మఙ్గలకన్దైర్మమాస్తు సారూప్యమ్ ॥౧.౩౯॥
🌷పదవిభాగం
మధుకర-సహచర-చికురైః మదన-ఆగమ-సమయ-దీక్షిత-కటాక్షైః । మణ్డిత-కమ్పాతీరైః మఙ్గల-కన్దైః మమ అస్తు సారూప్యమ్ ॥౧.౩౯॥
🌷అన్వయం
మధుకరసహచరచికురైః మదనాగమసమయదీక్షితకటాక్షైః మణ్డితకమ్పాతీరైః మఙ్గలకన్దైః మమ సారూప్యమ్ అస్తు ॥౧.౩౯॥
🌷ప్రతిపదార్థం
మధుకరసహచరచికురైః >
మధుకర-సహచర- = తుమ్మెదల వంటి
చికురైః = ముంగురులు గల
మదనాగమసమయదీక్షితకటాక్షైః >
మదనాగమ- = మదనశాస్త్ర
సమయ-దీక్షిత- = సిద్ధాంతముల యందు దీక్ష గలిగిన
కటాక్షైః = చూపులుగల
మణ్డిత-కమ్పా-తీరైః = కంపాతీరమును అలంకరించిన
మఙ్గల-కన్దైః = మంగళములకు జన్మ హేతువైన అమ్మవారితో
మమ = నాకు
సారూప్యం = సమాన రూపత
అస్తు = కలుగుగాక
🌷తాత్పర్యం
అమ్మవారి ముంగురులు తుమ్మెదల వంటివి. ఆమె కటాక్షములు మదనాగమ సమయ దీక్షితములు. అమ్మవారు కమ్పాతీరమున అలంకరించినది. మంగళములకు కారణమయిన అమ్మవారి సారూప్యము నాకు కలుగుగాక.
No comments:
Post a Comment