Thursday, July 26, 2018

ఆర్యా 1.47

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪౭వ శ్లోకం
అభిదాకృతిర్భిదాకృతిరచిదాకృతిరపి చిదాకృతిర్మాతః ।
అనహన్తా త్వమహన్తా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వమ్ ॥౧.౪౭॥
 
🌷పదవిభాగం
అభిద్-ఆకృతిః భిద్-ఆకృతిః అచిద్-ఆకృతిః అపి చిద్-ఆకృతిః మాతః । అనహన్తా త్వమ్ అహన్తా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వమ్ ॥౧.౪౭॥
 
🌷అన్వయం
మాతః కామాక్షి త్వమ్ అభిదాకృతిః అపి భిదాకృతిః అచిదాకృతిః అపి చిదాకృతిః అనహన్తా అపి అహన్తా శాశ్వతీ విశ్వమ్ భ్రమయసి ॥౧.౪౭॥
 
🌷ప్రతిపదార్థం
మాతః = అమ్మా
కామాక్షి = కామాక్షీదేవీ
త్వమ్ = నీవు
అభిదాకృతిః = భేదము లేని దానవు
అపి = అయినను
భిదాకృతిః = భేదము కలదానివి
అచిదాకృతిః అపి = జడవయినను
చిదాకృతిః = చైతన్య రూపిణివి
అనహన్తా = అహంత లేనిదానవు
అపి = అయినను
అహన్తా = అహంతా రూపిణివి
శాశ్వతీ = శాశ్వతియైన దానవై
విశ్వమ్ = ప్రపంచమును
భ్రమయసి = భ్రమింపచేయుచున్నావు
 
🌷తాత్పర్యం
ఓ తల్లీ! కామాక్షీ దేవీ! భేదాభేదాకృతులలో అనహన్తా హన్తాకృతులలో శాశ్వతమయిన దానివై యుండియు విశ్వమును భ్రమింపజేయుచున్నావు.

No comments:

Post a Comment