Thursday, July 26, 2018

ఆర్యా 1.33

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩౩వ శ్లోకం
కుట్మలితకుచకిశోరైః కుర్వాణైః కాఞ్చిదేశసౌహార్దమ్ ।
కుఙ్కుమశోణైర్నిచితం కుశలపథం శమ్భుకృతసమ్భారైః ॥౧.౩౩॥

🌷పదవిభాగం
కుట్మలిత-కుచ-కిశోరైః కుర్వాణైః కాఞ్చి-దేశ-సౌహార్దమ్ । కుఙ్కుమ-శోణైః నిచితం కుశల-పథం శమ్భు-కృత-సమ్భారైః ॥౧.౩౩॥
🌷అన్వయం
కుట్మలితకుచకిశోరైః కాఞ్చిదేశసౌహార్దం కుర్వాణైః కుఙ్కుమశోణైః శమ్భుకృతసమ్భారైః కుశలపథం నిచితం ॥౧.౩౩॥

🌷ప్రతిపదార్థం
కుట్మలిత-కుచ-కిశోరైః = మొగ్గతొడిగిన చిన్న కుచములు గల
కాఞ్చిదేశ-సౌహార్దమ్ = కాంచిదేశముతో మైత్రిని
కుర్వాణైః = చేయుచున్న
కుఙ్కుమ-శోణైః = కుంకుమవలె ఎర్రనయిన
శమ్భు-సుకృత-సమ్భారైః = శివుని పుణ్యముల అతిశయము చేత
కుశల-పథమ్ = మంగళమార్గము
నిచితమ్ = నింపబడినది

🌷తాత్పర్యం
మొగ్గదొడుగు చనుమొలకల నింపు గులుకునవి, కుంకుమపువ్వుల వర్ణము గలుగునవి, కాంచీపురముతో చెలిమి వాటించునవియునైన  శంభుని పుణ్యముల రాశిచే  మా క్షేమమార్గము నిండియున్నది.

No comments:

Post a Comment