Thursday, July 26, 2018

ఆర్యా 1.17

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౭వ శ్లోకం
మధురస్మితేన రమతే మాంసలకుచభారమన్దగమనేన ।
మధ్యే కాఞ్చి మనో మే మనసిజసామ్రాజ్యగర్వబీజేన ॥౧.౧౭॥

🌷పదవిభాగం
మధుర-స్మితేన రమతే మాంసల-కుచ-భార-మన్ద-గమనేన । మధ్యేకాఞ్చి మనో మే మనసిజ-సామ్రాజ్య-గర్వ-బీజేన ॥౧.౧౭॥

🌷అన్వయం
మధురస్మితేన మాంసలకుచభారమన్దగమనేన మనసిజసామ్రాజ్యగర్వబీజేన మధ్యేకాంచి మే మనః రమతే ॥౧.౧౭॥

🌷ప్రతిపదార్థం
మధుర-స్మితేన = మధురమగు చిరునవ్వుతో

మాంసలకుచభారమన్దగమనేన >
          మాంసల-కుచ-భార- = బలిసిన కుచముల బరువు వల్ల           మన్ద-గమనేన = కలిగిన మందగమనముతో
మనసిజసామ్రాజ్యగర్వబీజేన >
          మనసిజ- = మన్మథుని యొక్క
          సామ్రాజ్య- = సామ్రాజ్యపు
          గర్వబీజేన = గర్వమునకు కారణమయిన ఒక విత్తనము చేత
మధ్యే-కాంచి = కాంచీనగర మధ్యమున
మే = నా యొక్క
మనః = మనస్సు
రమతే = ఆడుకొనుచున్నది

🌷తాత్పర్యం
పాలిండ్ల బరువు చే మెల్లనగు నడకయు, సొంపు గులుకు చిరునవ్వును గల మన్మథ సామ్రాజ్యగర్వబీజమై కాంచీ మధ్యమునందు వసించు శృంగార రసాధి దేవతతో నా మనస్సు వినోదించుచున్నది.

No comments:

Post a Comment