🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪౪వ శ్లోకం
సమయా సాన్ధ్యమయూఖైః సమయా బుద్ధ్యా సదైవ శీలితయా ।
ఉమయా కాఞ్చీరతయా న మయా లభ్యేత కిన్తు తాదాత్మ్యమ్ ॥౧.౪౪॥
🌷౧.౪౪వ శ్లోకం
సమయా సాన్ధ్యమయూఖైః సమయా బుద్ధ్యా సదైవ శీలితయా ।
ఉమయా కాఞ్చీరతయా న మయా లభ్యేత కిన్తు తాదాత్మ్యమ్ ॥౧.౪౪॥
🌷పదవిభాగం
సమయా సాన్ధ్య-మయూఖైః సమయా బుద్ధ్యా సదైవ శీలితయా ఉమయా కాఞ్చీ-రతయా న మయా లభ్యేత కిన్తు తాదాత్మ్యమ్ ॥౧.౪౪॥
🌷అన్వయం
సాన్ధ్యమయూఖై సమయా సమయాబుధ్యా సదా శీలితయా కాఞ్చీరతయా ఉమయా తాదాత్మ్యమ్ తు కిం న లభ్యేత ॥౧.౪౪॥
🌷ప్రతిపదార్థం
సాన్ధ్యమయూఖై = సంధ్యా సమయ కిరణములతో
సమయా = సమానురాలైన
సమయాబుధ్యా = సమయాదేవి అనుబుద్ధితో
సదా = ఎల్లప్పుడు
శీలితయా = ధ్యానించబడిన
కాఞ్చీరతయా = కాంచీనగర మందు ఇష్టము గల
ఉమయా = కామాక్షీ దేవితో
తాదాత్మ్యమ్ తు = అభేదమే
కిం న లభ్యేత = ఎందుకు కలుగకుండునో
🌷తాత్పర్యం
సంధ్యాసమయ కిరణ సమాన కాంతి గలిగిన సమయాదేవి యను బుద్ధితో ధ్యానించబడిన కాంచీ నగర ప్రియయగు ఉమాదేవితో తాదాత్మ్యము కలుగకుండునా?
No comments:
Post a Comment