🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫౦వ శ్లోకం
మధ్యేహృదయం మధ్యేనిటలం మధ్యేశిరోఽపి వాస్తవ్యామ్ ।
చణ్డకరశక్రకార్ముకచన్ద్రసమాభాం నమామి కామాక్షీమ్ ॥౧.౫౦॥
🌷౧.౫౦వ శ్లోకం
మధ్యేహృదయం మధ్యేనిటలం మధ్యేశిరోఽపి వాస్తవ్యామ్ ।
చణ్డకరశక్రకార్ముకచన్ద్రసమాభాం నమామి కామాక్షీమ్ ॥౧.౫౦॥
🌷పదవిభాగం
మధ్యే-హృదయం మధ్యే-నిటలం మధ్యే-శిరః అపి వాస్తవ్యామ్ । చణ్డకర-శక్ర-కార్ముక-చన్ద్ర-సమ-ఆభాం నమామి కామాక్షీమ్ ॥౧.౫౦॥
🌷అన్వయం
మధ్యేహృదయం మధ్యేనిటలం మధ్యేశిరః అపి వాస్తవ్యామ్ । చణ్డకరశక్రకార్ముక-చన్ద్రసమాభాం కామాక్షీం నమామి ॥౧.౫౦॥
🌷ప్రతిపదార్థం
మధ్యేహృదయమ్ = హృదయ మధ్యమున
మధ్యేనిటలమ్ = ఫాల మధ్యమున
మధ్యేశిరః అపి = శిరో మధ్యమునను
వాస్తవ్యామ్ = నివసించునట్టి
చణ్డకర-శక్రకార్ముక-చన్ద్ర-సమాభామ్ = సూర్యునితో, సింగిణితో, చంద్రునితో సమానకాంతిగల
కామాక్షీమ్ = కామాక్షీ దేవికి
నమామి = నమస్కరించుచున్నాను
🌷తాత్పర్యం
హృదయ ఫాల శిరో మధ్యభాగములలో నివసించు సూర్య శక్ర ధనుశ్చంద్రుల కాంతితో సమాన
కాంతి గల శ్రీకామాక్షీ దేవికి నమస్కరించుచున్నాను.
No comments:
Post a Comment