Thursday, July 26, 2018

ఆర్యా 1.31

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩౧వ శ్లోకం
వీక్షేమహి కాఞ్చిపురే విపులస్తనకలశగరిమపరవశితమ్ ।
విదృమసహచరదేహం విభ్రమసమవాయసారసంవాహమ్ ॥౧.౩౧॥

🌷పదవిభాగం
వీక్షేమహి కాఞ్చి-పురే విపుల-స్తన-కలశ-గరిమ-పరవశితమ్ । విదృమ-సహచర-దేహం విభ్రమ-సమవాయ-సార-సంవాహమ్ ॥౧.౩౧॥

🌷అన్వయం
కాఞ్చిపురే విపులస్తనకలశగరిమపరవశితం విదృమసహచరదేహం విభ్రమసమవాయ-సారసంవాహం వీక్షేమహి ॥౧.౩౧॥

🌷ప్రతిపదార్థం
కాఞ్చిపురే = కాంచీ నగరమున
విపులస్తనకలశగరిమపరవశితమ్ >

          విపుల-స్తన-కలశ- = పెద్ద కలశముల వంటి స్తనముల
          గరిమ-పరవశితమ్ = బరువుచే పరవశించిన
విపులస్తనకలశగరిమపరవశితమ్ >
    విపుల-స్తన-కలశ- = పెద్ద కలశముల వంటి స్తనముల
    గరిమ-పరవశితమ్ = బరువుచే పరవశించిన
విద్రుమ-సహచర-దేహం = పగడముల వంటి దేహముగల అమ్మవారిని
వీక్షేమహి = చూచెదను

🌷తాత్పర్యం
విపుల కుచకుంభ భారముచే వివశమయి, పగడములకు ఈడుజోడగు ఎఱ్రని శరీర సోయగము కలదయి, సకల విలాస సారమెల్ల రూపుగొన్న పరదేవతా స్వరూపమును కాంచీపురమున కాంచుచున్నాను.

No comments:

Post a Comment