🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪౦వ శ్లోకం
వదనారవిన్దవక్షోవామాఙ్కతటీవశంవదీభూతా ।
పురుషత్రితయే త్రేధా పురన్ధ్రిరూపా త్వమేవ కామాక్షి ॥౧.౪౦॥
🌷పదవిభాగం
వదన-అరవిన్ద-వక్షో-వామ-అఙ్క-తటీ-వశంవదీ-భూతా । పురుష-త్రితయే త్రేధా పురన్ధ్రి-రూపా త్వమ్ ఏవ కామాక్షి ॥౧.౪౦॥
🌷అన్వయం
కామాక్షి త్వమ్ ఏవ పురుషత్రితయే వదనారవిన్ద-వక్షోవామాఙ్కతటీ-వశంవదీభూతా । త్రేధా పురన్ధ్రిరూపా ॥౧.౪౦॥
🌷ప్రతిపదార్థం
కామాక్షి = ఓ కామాక్షీదేవీ
త్వమ్ ఏవ = నీవే
పురుష-త్రితయే = ముగ్గురు పురుషులయందు
వదన-అరవిన్ద-వక్షో-వామ-అఙ్క-తటీ = వదనమున, వక్షమున, వామాంకమున
వశంవదీ-భూతా = వశంవద అయిన దానవై
త్రేధా = మూడు విధములుగా
పురన్ధ్రి-రూపా = స్త్రీరూపములు గలదానవైనావు.
🌷తాత్పర్యం
ఓ కామాక్షీదేవీ! ముగ్గురు పురుషుల యందు వదన వక్షో వామాంక తటములలో పరవశించుచు మూడు విధముల స్త్రీరూపములు ధరించి యున్నదానవు నీవే.
No comments:
Post a Comment