Wednesday, July 25, 2018

ఆర్యా 1.11

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౧వ శ్లోకం
కాఞ్చీరత్నవిభూషాం కామపి కన్దర్పసూతికాపాఙ్గీమ్ ।
పరమాం కలాముపాసే పరశివవామాఙ్కపీఠికాసీనామ్ ॥౧.౧౧॥

🌷పదవిభాగం
కాఞ్చీ-రత్న-విభూషాం కామ్ అపి కన్దర్ప-సూతికా-అపాఙ్గీమ్ । పరమాం కలామ్ ఉపాసే పరశివ-వామ-అఙ్క-పీఠికా-ఆసీనామ్ ॥౧.౧౧॥

🌷అన్వయం
కాఞ్చీరత్నవిభూషాం కందర్పసూతికాపాఙ్గీం పరశివవామాఙ్కపీఠికాసీనాం కామపి పరమాం కలామ్ ఉపాసే ॥౧.౧౧॥

🌷ప్రతిపదార్థం
కాఞ్చీరత్న-విభూషామ్ = కాంచీ నగరికి రత్నాలంకారమయిన
కన్దర్ప-సూతికా-అపాఙ్గీమ్ = మన్మథుని ప్రసూతిగృహమైన కటాక్షములుగల
పరశివ-వామాఙ్క-పీఠికా-ఆసీనామ్ = పరశివుని తొడ యనెడు పీఠముపై కూర్చొనియున్న
కామ్ అపి  = ఒకానొక
పరమామ్ = శ్రేష్ఠమయిన
కలామ్ = కలను
ఉపాసే = ఉపాసించెదను

🌷తాత్పర్యం
అద్భుత విలాసములతో, అపార కృపారసముతో, మన్మథుని ప్రసవించు కటాక్షముతో కాంచీరత్న భూషణమై పరమశివుని వామాంక పీఠికయందు ఆసీనురాలగు ఒకానొక పరమ కళను ఉపాసించెదను.

No comments:

Post a Comment