Friday, July 27, 2018

ఆర్యా 1.63

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬౩వ శ్లోకం
కౌతుకినా కమ్పాయాం కౌసుమచాపేన కీలితేనాన్తః ।
కులదైవతేన మహతా కుట్మలముద్రాం ధునోతు నః ప్రతిభా ॥౧.౬౩॥

🌷పదవిభాగం
కౌతుకినా కమ్పాయాం కౌసుమచాపేన కీలితేన అన్తః కులదైవతేన మహతా కుట్మలముద్రాం ధునోతు నః ప్రతిభా ॥౧.౬౩॥

🌷అన్వయం
కమ్పాయాం కౌతుకినా కౌసుమచాపేన మహతా అన్తః కీలితేన కులదైవతేన నః ప్రతిభా కుట్మలముద్రాం ధునోతు ॥౧.౬౩॥

🌷ప్రతిపదార్థం
కమ్పాయామ్ = కంపానది యందు
కౌతుకినా = కుతూహలము గల
కౌసుమ-చాపేన = పూల విల్లు గల
మహతా = గొప్పదైన
అన్తః = లోపల
కీలితేన = చెక్కబడిన
కుల-దైవతేన = కులదైవమైన అమ్మవారిచేత
నః = మా యొక్క
ప్రతిభా = కవితా నిర్మాణశక్తి
కుట్మల-ముద్రామ్ = మొగ్గదొడిగి యుండు ముద్రను
ధునోతు = విడచుగాక

🌷తాత్పర్యం
కమ్పానదియందు కౌతుకము గలది, పూలు విల్లుగ ధరించి నా లోపల చెక్కబడినట్లు స్థిరముగా నిలచి యుండునదియు గొప్ప కులదేవత యగు అమ్మవారి చేత మా కావ్యనిర్మాణ ప్రతిభ వికసించుగాక.

No comments:

Post a Comment