Thursday, July 26, 2018

ఆర్యా 1.20

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨౦వ శ్లోకం
శ్వేతా మన్థరహసితే శాతా మధ్యే చ వాఙ్మనోతీతా ।
శీతా లోచనపాతే స్ఫీతా కుచసీమ్ని శాశ్వతీ మాతా ॥౧.౨౦॥

🌷పదవిభాగం
శ్వేతా మన్థర-హసితే శాతా మధ్యే చ వాఙ్మనోతీతా । శీతా లోచన-పాతే స్ఫీతా కుచ-సీమ్ని శాశ్వతీ మాతా ॥౧.౨౦॥

🌷అన్వయం
శాశ్వతీ మాతా మన్థరహసితే శ్వేతా, మధ్యే శాతా, వాఙ్మనోతీతా, లోచనపాతే శీతా, కుచసీమ్ని స్ఫీతా ॥౧.౨౦॥

🌷ప్రతిపదార్థం
శాశ్వతీ = నిత్యయగు
మాతా = తల్లి
మన్థర-హసితే = మందహాసమునందు
శ్వేతా = తెల్లనిది
మధ్యే = నడుమున
శాతా = కృశించినది
వాఙ్మనోతీతా = వాక్కునకు, మనస్సునకు అందనిది
లోచన-పాతే = దృష్టి పాతమున
శీతా = చల్లనిది
కుచ-సీమ్ని = కుచ ప్రదేశమున
స్ఫీతా = లావయినది

🌷తాత్పర్యం
చిఱునవ్వుల తెల్లనిదై, నడుమున సన్ననిదై, వాల్జూపుల చల్లనిదై, చనుకట్టున నిండైనదై మాటకు, మనసుకు అందనిదై, కలకాలము తల్లియై ఒకతల్లి కాంచీపురమందు విలసిల్లుచున్నది.

No comments:

Post a Comment