Friday, July 27, 2018

ఆర్యా 1.60

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬౦వ శ్లోకం
ఆదిక్షన్మమ గురురాడాదిక్షాన్తాక్షరాత్మికాం విద్యామ్ ।
స్వాదిష్ఠచాపదణ్డాం నేదిష్ఠామేవ కామపీఠగతామ్ ॥౧.౬౦॥

🌷పదవిభాగం
ఆదిక్షన్ మమ గురురాడ్ ఆది-క్ష-అన్త-అక్షరాత్మికాం విద్యామ్ । స్వాదిష్ఠ-చాప-దణ్డాం నేదిష్ఠామేవ కామపీఠగతామ్ ॥౧.౬౦॥

🌷అన్వయం
స్వాదిష్ఠచాపదణ్డామ్ కామపీఠగతామ్ నేదిష్ఠామ్ ఆదిక్షాన్తాక్షరాత్మికామ్ విద్యామ్ ఏవ గురురాట్ మమ ఆదిక్షత్ ॥౧.౬౦॥

🌷ప్రతిపదార్థం
స్వాదిష్ఠ-చాప-దణ్డామ్ = మిక్కిలి తీయని చెఱకు వింటి కఱ్రగల
కామ-పీఠ-గతామ్ = కామపీఠమందున్న
నేదిష్ఠామ్ = మిక్కిలి సమీపమందున్న
ఆదిక్షాన్త-అక్షరాత్మికామ్ = అకారము మొదలు క్షకారము వరకు గల అక్షరములు స్వరూపము గాగల
విద్యామ్ ఏవ = విద్యయేయైన అమ్మవారిని --మాతృకను
గురురాట్ = గురు సార్వభౌముడు
మమ = నాకు
ఆదిక్షత్ = ఉపదేశించెను

🌷తాత్పర్యం
తీయని చెఱకు వింటి కఱ్ఱ ధరించిన కామపీఠమునందున్న మిక్కిలి దగ్గరగా నున్న అకారాది క్షకారాంతమయిన మాతృకను నాకు గురుసార్వభౌముడు ఉపదేశించెను.

No comments:

Post a Comment