Thursday, July 26, 2018

ఆర్యా 1.53

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫౩వ శ్లోకం
శమ్పాలతాసవర్ణం సమ్పాదయితుం భవజ్వరచికిత్సామ్ ।
లిమ్పామి మనసి కిఞ్చన కమ్పాతటరోహి సిద్ధభైషజ్యమ్ ॥౧.౫౩॥

🌷పదవిభాగం
శమ్పాలతా-సవర్ణం సమ్పాదయితుం భవ-జ్వర-చికిత్సామ్ । లిమ్పామి మనసి కిఞ్చన కమ్పా-తట-రోహి సిద్ధ-భైషజ్యమ్ ॥౧.౫౩॥

🌷అన్వయం
శమ్పాలతాసవర్ణం భవజ్వరచికిత్సాం సమ్పాదయితుం కమ్పాతటరోహి కిఞ్చన సిద్ధభైషజ్యం మనసి లిమ్పామి ॥౧.౫౩॥

🌷ప్రతిపదార్థం
శమ్పాలతా-సవర్ణం = మెఱుపు తీగవంటి
భవ-జ్వర-చికిత్సామ్ = సంసార రోగ చికిత్సను
సమ్పాదయితుం = సంపాదించుటకు
కమ్పా-తట-రోహి = కంపానదీ తటమున మొలచు
కిఞ్చన = ఒకానొక
సిద్ధ-భైషజ్యమ్ = సిద్ధౌషధమును
మనసి = మనస్సున
లిమ్పామి = పూసెదను

🌷తాత్పర్యం
సంసార రోగమునకు చికిత్స చేయుటకు మెఱుపు తీగ వంటి వన్నెతో సమానమయిన వన్నె గలిగి కంపానదీ తీరమున మొలచు సిద్ధౌషధమును ఒక దానిని, అనగా అమ్మవారిని, నా మనసున పూసెదను.

No comments:

Post a Comment