🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬౬వ శ్లోకం
దగ్ధషడధ్వారణ్యం దరదలితకుసుమ్భసమ్భృతారుణ్యమ్ ।
కలయే నవతారుణ్యం కమ్పాతటసీమ్ని కిమపి కారుణ్యమ్ ॥౧.౬౬॥
🌷౧.౬౬వ శ్లోకం
దగ్ధషడధ్వారణ్యం దరదలితకుసుమ్భసమ్భృతారుణ్యమ్ ।
కలయే నవతారుణ్యం కమ్పాతటసీమ్ని కిమపి కారుణ్యమ్ ॥౧.౬౬॥
🌷పదవిభాగం
దగ్ధ-షడధ్వా-అరణ్యం దరదలిత-కుసుమ్భ-సమ్భృత-ఆరుణ్యమ్ । కలయే నవ-తారుణ్యం కమ్పా-తట-సీమ్ని కిమ్ అపి కారుణ్యమ్ ॥౧.౬౬॥
🌷అన్వయం
దగ్ధషడధ్వారణ్యం దరదలితకుసుమ్బ-సమ్భృతారుణ్యమ్ కమ్పాతటసీమ్ని కిమ్ అపి కారుణ్యమ్ తవ తారుణ్యమ్ కలయే ॥౧.౬౬॥
🌷ప్రతిపదార్థం
దగ్ధ-షడధ్వా-అరణ్యం = కాల్చిన షడధ్వమను అరణ్యము గల
దరదలితకుసుమ్భ-సమ్భృతారుణ్యమ్ >
దరదలిత-కుసుమ్బ- = కొంచెము వికసించిన కుసుమ్బ పుష్పములుగల
సమ్భృతారుణ్యమ్ = ఎఱుపును మోసిన
కమ్పా-తట-సీమ్ని = కంపానదీ తట ప్రదేశమున
కిమ్ అపి = ఏదో
కారుణ్యమ్ = దయ యనెడు
తవ = నీ యొక్క
తారుణ్యమ్ = యౌవనమును
కలయే = ధ్యానించెదను
🌷తాత్పర్యం
షడధ్వారణ్యమును కాల్చిన, కొంచెము వికసించిన కుసుంభ పుష్పముల యెఱుపును ధరించిన, కంపాతట ప్రదేశమున వెలసిన దయయో అనదగిన నీ యౌవనమును ధ్యానించెదను.
No comments:
Post a Comment