Thursday, July 26, 2018

ఆర్యా 1.21

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨౧వ శ్లోకం
పురతః కదా ను కరవై పురవైరివిమర్దపులకితాఙ్గలతామ్ ।
పునతీం కాఞ్చీదేశం పుష్పాయుధవీర్యసరసపరిపాటీమ్ ॥౧.౨౧॥

🌷పదవిభాగం
పురతః కదా ను కరవై పుర-వైరి-విమర్ద-పులకిత-అఙ్గ-లతామ్ । పునతీం కాఞ్చీ-దేశం పుష్పాయుధ-వీర్య-సరస-పరిపాటీమ్ ॥౧.౨౧॥

🌷అన్వయం
పురవైరివిమర్దపులకితాఙ్గలతాం పునతీం కాఞ్చీదేశం పుష్పాయుధవీర్యసరసపరిపాటీం కదా ను పురతః కరవై ॥౧.౨౧॥

🌷ప్రతిపదార్థం
పురవైరి-విమర్ద-పులకిత-అఙ్గ-లతామ్ = శివుని కౌగిలింతతో పులకించిన తీగవంటి శరీరముగల
కాఞ్చీ-దేశమ్ = కాంచీనగరప్రాంతమును
పునతీమ్ = పవిత్ర మొనర్చుచున్న
పుష్పాయుధ-వీర్య-సరస-పరిపాటీం = మన్మథుని వీర్యము యొక్క సరసపరిపాటీయైనదానిని
కదా = ఎప్పుడు
పురతః = ఎదుట
కరవై = చేసికొందునో

🌷తాత్పర్యం🌷
త్రిపుర వైరి బిగి కౌగిలిలో పులకించు నెమ్మేను గలది, కాంచీ మండలము నెల్ల పవిత్రము చేయునది యగు
పుష్పబాణుని పరాక్రమ రస పరిపాటిని నేనెన్నడు నా ముందు సాక్షాత్కరింపచేసి కొందునో కదా.

No comments:

Post a Comment