🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౮వ శ్లోకం
ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీం ।
అమ్బుమయీమిన్దుమయీమమ్బామనుకమ్పమాదిమామీక్షే ॥౧.౧౮॥
🌷౧.౧౮వ శ్లోకం
ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీం ।
అమ్బుమయీమిన్దుమయీమమ్బామనుకమ్పమాదిమామీక్షే ॥౧.౧౮॥
🌷పదవిభాగం
ధరణి-మయీం తరణి-మయీం పవన-మయీం గగన-దహన-హోతృ-మయీం । అమ్బు-మయీమ్ ఇన్దు-మయీమ్ అమ్బామ్ అనుకమ్పమ్ ఆదిమామ్ ఈక్షే ॥౧.౧౮॥
🌷అన్వయం
ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహన-హోతృమయీం అమ్బుమయీమ్ ఇన్దుమయీమ్ అమ్బామ్ అనుకమ్పమ్ ఆదిమామ్ ఈక్షే ॥౧.౧౮॥
🌷ప్రతిపదార్థం
ధరణిమయీం = భూమూర్తి
తరణిమయీం = సూర్యమూర్తి
పవనమయీం = వాయుమూర్తి
గగన-దహన-హోతృమయీం = ఆకాశ మూర్తి అగ్నిమూర్తి, యజమానమూర్తి
అమ్బుమయీం = జలమూర్తి
ఇన్దుమయీం = చంద్రమూర్తియు నయిన
ఆదిమాం = మొదటి
అమ్బాం = తల్లిని
అనుకమ్పం = కంపానదీ తీరమున
ఈక్షే = చూచుచున్నాను
🌷తాత్పర్యం
భూమి, సూర్య, వాయు, ఆకాశ, అగ్ని మూర్తి, యజమాన, జలచంద్ర రూప అష్టమూర్తి మయమగు మొదటి తల్లిని కంపానదీ తీరమున చూచుచున్నాను.
No comments:
Post a Comment