🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౩౭వ శ్లోకం
🌷౧.౩౭వ శ్లోకం
పుఞ్జితకరుణముదఞ్చితశిఞ్జితమణికాఞ్చి కిమపి కాఞ్చిపురే ।
మఞ్జరితమృదులహాసం పిఞ్జరతనురుచి పినాకిమూలధనమ్ ॥౧.౩౭॥
🌷పదవిభాగం
పుఞ్జిత-కరుణమ్ ఉదఞ్చిత-శిఞ్జిత-మణికాఞ్చి కిమ్ అపి కాఞ్చి-పురే । మఞ్జరిత-మృదుల-హాసం పిఞ్జర-తను-రుచి పినాకి-మూల-ధనమ్ ॥౧.౩౭॥
🌷అన్వయం
పుఞ్జితకరుణమ్ ఉదఞ్చితశిఞ్ఙిత-మణికాఞ్చి మఞ్జరిత-మృదులహాసమ్ పిఞ్జరతనురుచి కిమపి పినాకిమూలధనమ్ కాఞ్చిపురే అస్తి ॥౧.౩౭॥
🌷ప్రతిపదార్థం
పుఞ్జిత-కరుణమ్ = ఘనీభవించిన దయయగు
ఉదఞ్చితశిఞ్జితమణికాఞ్చి >
ఉదఞ్చిత-శిఞ్ఙిత- = పూజనీయ ధ్వనిగల
మణి-కాఞ్చి = మణికాంచి కలదైన
మఞ్జరితమృదులహాసం >
మఞ్జరిత- = గుత్తిగా చేసుకొన్న
మృదుల-హాసమ్ = చిరునవ్వు గల
పిఞ్జర-తను-రుచి = పింజర వర్ణ దేహకాంతి గల
కిమ్ అపి = ఒకానొక
పినాకి-మూల-ధనమ్ = శివుని మూల ధనము
కాఞ్చిపురే = కాంచీ నగరమున
అస్తి = కలదు
🌷తాత్పర్యం
కరుణరసము మూర్తీభవించినది, మణికింకిణులతో మ్రోయు ఒడ్డాణము గలది, పూగుత్తుల బోలు చిఱునవ్వుల గుల్కునది అలముకొను నెమ్మేని తళుకులు గలదియునై పినాకి మూలధనము ఒకటి కాంచీపురమందు ఒప్పుచున్నది.
No comments:
Post a Comment